200 మంది భక్తులు గోటితో వడ్లను ఓలిచారు రామయ్య కళ్యానానికి మా తలంబ్రాలు మా అదృష్టం అద్భుత కార్యక్రమం చేపట్టిన రామకోటి రామరాజును సన్మానించారు జనం న్యూస్ మార్చ్ 12, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) శ్రీరామకోటి భక్త సమాజం చేస్తున్న గత 26సంవత్సరాల ఆధ్యాత్మిక కృషిని గుర్తించి భద్రాచల దేవస్థాన గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని ముచ్చటగా మూడో సారి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజుకు 250కిలోల వడ్లను అందించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రామకోటి రామరాజు గ్రామ, గ్రామాన తిరిగి లక్షల మంది భక్తులచే గోటి తలంబ్రాలు ఓలిపిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం నాడు సిద్దిపేటలోని గణేష్ నగర్ లోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో కోటి తలంబ్రాల దీక్ష ఘనంగా నిర్వహించారు. ఇందులో 200 మంది భక్తులు పాల్గొని రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్లను ఓలిచి రామకోటి రామరాజు,కి అక్కడే అందజేషి రామభక్తిని చాటుకున్నారు. మేము భద్రాచల వెళ్ళలేకున్న మా తలంబ్రాలు వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి అద్భుత అవకాశం కల్పించినందుకు భక్తులు రామకోటి రామరాజును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు పెందోటి శ్రీనివాస్, చంద్రమౌళి, రవి, వెంకటేష్, అర్చకులు వెంకటరమణచారి, సీతారామాంజనేయ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.