జనం న్యూస్ మార్చి 11 (నూకల రవీందర్)మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శితేజావత్ వాసు నాయక్ మహబూబాద్ జిల్లా అధ్యక్షుడు బొడ రమేష్ నాయక్ఈరోజు గంగారం మండలం లో లంబాడి హక్కుల పోరాట సమితి గంగారం మండల అధ్యక్షుడు బోడ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఈనెల 29 న మానుకోటలో గిరిజనుల హక్కుల సాధనకై జరిగే సభను విజయవంతం చేయాలని కరపత్రం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రమేష్ నాయక్ , తేజావత్ వాసు నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 12 శాతం గల జనాభా కలిగి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి గిరిజనులు అందరూ గంపగుత్తగా ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను గెలిపించుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం కావస్తున్నా కూడా గిరిజనులకు సంబంధించిన ఎస్టీ కార్పొరేషన్ నిధులు గాని, ట్రైకార్ లోన్లు గాని, గిరిజనుల అభివృద్ధి కోసం ఎటువంటి ఒక్క రూపాయి కూడా బడ్జెట్ విడుదల చేయలేదని అన్నారు. అదేవిధంగా లంబాడి సామాజిక వర్గానికి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. గెలిచిన లంబాడి సామాజిక వర్గం ఎమ్మెల్యేలలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా లంబాడీల మాతృభాషా ఆయన గోర్ బోలి ను గుర్తించి రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్ లో చేర్చాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సమగ్రమైన కుల గణన చేపట్టి రాష్ట్రంలో 12 శాతం, కేంద్రంలో 14 శాతం వరకు రిజర్వేషన్ కల్పించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని అన్నారు. కుల వర్గీకరణలో క్రీమీలేయర్ ను పాటించి రిజర్వేషన్లను జీరో చేసే కుట్రను విరమించుకోవాలన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి తండాల, గుడాల గ్రామపంచాయతీలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించి వాటి అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఏజెన్సీ చట్టాలను 100% అమలు చేయాలని అన్నారు. మైదాన ప్రాంతాలలో ఉండే ప్రతి జిల్లాలలో మైదాన ప్రాంత ఐటిడిఏ లను ఏర్పాటు చేసి గిరిజనులు అభివృద్ధి చెందే విధంగా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ విధానంలో ఏజెన్సీ వ్యవస్థను రద్దుచేసి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. అతిపెద్ద గిరిజన జిల్లా అయిన మహబూబాబాద్ లో గిరిజన మ్యూజియం ను ఏర్పాటు చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో లంబాడీల కోసం కమ్యూనిటీ హాల్ లను నిర్మించాలని కోరారు. గురుకులాలు, ఆశ్రమ హాస్టల్ లలో చదివే విద్యార్థినీ, విద్యార్థులకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవిన్యూ చట్టాన్ని వెంటనే అమలు చేసి గిరిజనులకు సంబంధించిన భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించి గిరిజనుల భూములు కబ్జాకు గురికాకుండా చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ధరావత్ హాతిరం నాయక్, బానోత్ రవి నాయక్ చైర్మన్ ప్రధాన కార్యదర్శిశివరాం నాయక్ బాలు నాయక్ దేవేందర్ నాయక్, రాందాస్ నాయక్ బిక్షపతి, అనిత, భద్రమ్మ,లక్ష్మి, బానోత్ సాయి నాయక్, బోడ సాయి నాయక్ తదితరులు పాల్గొన్నారు.