జనం న్యూస్ మార్చి 13 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కెపిహెచ్బి కాలనీ ఆరో ఫేస్ లో వేంచేసి ఉన్న శ్రీ విజయ దుర్గ రామలింగేశ్వర స్వామి వార్ల దేవాలయంలో బుధవారం శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి, శ్రీ దక్షిణామూర్తి వార్ల దివ్య విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అఖిల భారత హనుమద్దీక్ష పీఠాధిపతులు దుర్గాప్రసాద్ వారి సమక్షంలో అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన హోమం, పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వామివార్ల దర్శనం చేసుకున్నారు . మహిళలు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు అన్న సంతర్పణ చేశారు ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు విజయ్ కుమార్ చౌదరి రామారావు మరియు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు ప్రవీణ్ అప్పారావు శివ చౌదరి నలినికాంత్ రమణ రజిత సంధ్య తదితరులు పాల్గొన్నారు