జనం న్యూస్ మార్చ్ 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఊసరవెల్లి ఎన్ని రంగులు మారుస్తుందో జగన్ రెడ్డి కూడా ఫీజు రియంబర్స్మెంట్ మీద ఒకరోజు ఫీజు పోరు నేడు యువత పోరు రేపు ఏ పోరో తెలియదని తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ కొణతాల వెంకటరావు జగన్ రెడ్డి వైఖరిపై విరుచుకుపడ్డారు. జగన్ రెడ్డి పాలనలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసినట్టుగానే విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారని జగన్ రెడ్డి నిరంకుశ మూర్ఖత్వ నిర్ణయాల వల్ల 10 లక్షల మంది బడుగు బలహీనవర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు విద్యకు దూరమయ్యారని వెంకటరావు జగన్ రెడ్డిపై మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టినప్పుడు, డిగ్రీ కళాశాలలు, ఇంటర్ కళాశాలకు దారిద్య రేఖ దిగువ ఉన్న బడుగు బలహీన వర్గాల పిల్లలకు నేరుగా కళాశాల యాజమాన్యానికి చెల్లించేవారని, జగన్ రెడ్డి పాలనలో ఫీజు రియంబర్స్మెంట్ తల్లులు ఖాతాలకు వేయడం వల్ల విద్యార్థుల పాలిట శాపంగా మారిందని, విద్యార్థి విద్యార్థులు చదువు పూర్తి అయిన తర్వాత ఉన్నత చదువులకు సర్టిఫికెట్ల కోసం వెళ్ళగా కాలేజీ యాజమాన్యం ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేయడంతో చాలామంది విద్యార్థులు ఉన్నత చదువులు కోల్పోయారని, ఆనాటికి మూడు క్వార్టర్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి పెట్టారని, 2024 ఎన్నికల ముందు బటన్ నొక్కుతానని చెప్పి తమ కాంట్రాక్టులకు కమిషన్ తీసుకొని బిల్లులు చెల్లించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేశారని వెంకటరావు అన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో సుమారు ఏడాదిపాటు విద్యార్థులకు ఫీజులు చెల్లించలేదని, కూటమి ప్రభుత్వం అధికారంకు వచ్చిన తర్వాత విద్యార్థులు ఫీజు బకాయిలను 788 కోట్లు చెల్లించిందని మిగతా బ్యాలెన్స్ దశలవారీగా చెల్లిస్తామని కాలేజీ యాజమాన్యాలకి స్పష్టం చేశారని, జగన్ రెడ్డి లెవెన్ రెడ్డి తన ఉనికిని కాపాడుకోవడానికి పోరుబాట పేరుతో ఉద్యమాలకు పిలుపునివ్వడంతో విద్యార్థులు నవ్వుకుంటున్నారని, ఊరు బాట ఉద్యమంలో ఒక్క విద్యార్థి సంఘం కూడా పాల్గొలేదని, ఇది కేవలం జగన్ రెడ్డి పోరు భరించలేక వైసీపీ శ్రేణులు తగదన్నమ్మ అని రోడ్డు ఎక్కారని వెంకటరావు ఎద్దేవా చేశారు. నేడు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తున్నారని, విద్యావ్యవస్థలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా రాజకీయ నీడలు విద్యార్థులపై పడకుండా సంఘసంస్కర్తల పేరుతో పథకాలకు పేర్లు పెట్టి డొక్కా సీతమ్మ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇలాంటి ప్రముఖుల పేరుతో పథకాలు ప్రవేశ పెట్టడం వల్ల ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారని, జగన్ రెడ్డి తన పేరు పిల్లలు బ్యాగులు, పాఠ్యపుస్తకాల మీద, తుదకు చిక్కిలి మీద తన బొమ్మలు పెట్టుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వెంకటరావు అన్నారు. ఉపాధ్యాయులకు సంబంధించి జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకువస్తామని, తరగతికి ఒక టీచర్ ను ఇచ్చేలాగా మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాట్లు చర్యలు తీసుకుంటున్నారని, పిల్లలు బ్యాగులు బరువు తగ్గించేందుకు సెమిస్టర్ల వారీగా పుస్తకాల ముద్రిస్తున్నారని, ఉపాధ్యాయ బదిలీలకు చట్టం చేస్తున్నారని, నిరుద్యోగ యువతీ యువకులకు మార్చి నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 16,437 ఉద్యోగాలకు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భోగలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చర్యలను అభినందించారు. ఈ కార్యక్రమంలో 80 వ డివిజన్ టిడిపి నాయకులు దాడి జగన్నాధరావు పాల్గొనారు.