కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన జనం న్యూస్ మార్చ్ 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టి కలెక్టర్ కి వినతిపత్రం అందించిన అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, మాజీ పార్లమెంట్ సభ్యురాలు బీశెట్టి సత్యవతి,మాజీ యలమంచిలి శాసనసభ్యులు ఉప్పలపాటి వెంకటరమణ మూర్తి రాజు, చోడవరం మాజీ శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ, మాజీ పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు, మాజీ నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమా శంకర్ గణేష్, మాజీ శాసనసభ్యులు కంబాల జోగులు,మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్త ఈర్లె అనురాధ,మాజీ గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్, మాజీ పార్లమెంట్ పరీశీలకులు శరగడం చిన్నఅప్పలనాయుడు, కలసి
కూటమి ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిందని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి నేడు ఒక్క హామీ ను కూడా నెరవేర్చ లేదు.జగన్ సీ.ఎం గా ఉన్న సమయంలో నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థ ను సమూల మార్పులు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు బైజూస్, ట్యాబ్ లు అందించారు. డాక్టర్ కావాలన్న విద్యార్థులకు ఫిజు రీయింబర్స్మెంట్ ఇచ్చేవారు. నేడు కూటమి అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్పింది..నేటి వరకు ఇచ్చిన 700 కోట్లు.. కానీ కావాల్సింది 4వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో కూడా తక్కవ కేటాయించారు. విద్యార్థులు చదువులు మానుకునే పరిస్థితి నెలకొంది. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో నేడు కలెక్టర్ వద్ద ఆందోళన చేసి,కలెక్టర్ కి వినతిపత్రం అందచేశారు.యువతకు ఉద్యోగం వచ్చేవరకు 3వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని అన్నారు.నేటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం దగా చేస్తుంది.జగన్ 15 మెడికల్ కాలేజీలు కట్టాలని నిర్ణయించారు.. ఇందులో 5 కాలేజీ పూర్తి చేశారు..కానీ నేడు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తామన్నారు.దీని మీద విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.