జనం న్యూస్ మార్చ్ 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీం జిల్లా కు చెందిన ఉపాధ్యాయుడు నూతి అభిలాష్ యం పి పి యస్ మేదరిగుడ లో ఎస్ జీ టీ గా విధులు నిర్వహిస్తున్నాడు,సాహిత్య రంగంలో విశిష్టమైన ప్రతిభ కనబరిచిన డా. నూతి అభిలాష్ "స్వామి వివేకానంద సాహిత్య అవార్డు" కు ఎంపిక చేసినట్లుగా సంస్థ నిర్వాహకులు బుధవారం వారు ప్రకటన తెలియచేశారు. జోలీ పబ్లికేషన్ సంస్థ 2025 సంవత్సరం కి గాను నిర్వహించిన ఈ సాహిత్య పురస్కార కార్యక్రమంలో, అభిలాష్ రచన ఎంతో మంది చదువరులను ఆకట్టుకుంది.అభిలాష్ రచనలోని భావ వైభవం, విశ్లేషణాత్మకత, హృదయాన్ని తాకే శైలి వారికి ఈ గుర్తింపు తీసుకొచ్చిందని"కలంతో సమాజ మార్పుకు వేదికవ్వాలి" అనే అభిలాష్ లక్ష్యాన్ని ఈ పురస్కారం మరింత బలపరిచిందని ఈ సందర్భంగా జోలీ పబ్లికేషన్ సీఈఓ & సహ వ్యవస్థాపకుడు మయాంక్ అభిలాష్ ని అభినందిస్తూ, "సాహిత్య ప్రపంచానికి వారు అందించిన రచన గొప్పదని, భవిష్యత్తులో ఇంకా అపూర్వమైన రచనలు అందించాలని" ఆకాంక్షించారు.సామాజిక సమస్యలను స్పృశిస్తూ, భావోద్వేగపూరిత రచనల ద్వారా పాఠకుల్లో ఆలోచన రేకెత్తించే అభిలాష్ కలం మరింత పదునెక్కాలని, ఇంకా ఎన్నో గొప్ప పురస్కారాలను అందుకోవాలని సాహిత్య ప్రపంచం ఆకాంక్షిస్తోందని తెలియచేశారు ఈ సాహితీ పోటీ లో అనేక రాష్ట్రాలకు చెందిన కవులు పాల్గొనడం జరిగింది.