జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 12 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె.అమల కుమారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పెట్టుబడులేని ప్రకృతి వ్యవసాయం సాగు చేయటం వలన భూమి సారవంతంగా ఉండి ప్రధాన పంటకు కావలసిన సూక్ష్మ పోషకాలు అభివృద్ధి చెంది పంట ఆరోగ్యంగా ఉండి, ఖర్చులు తగ్గి రైతులు అధిక దిగుబడులు, ఆదాయం పొందవచ్చని పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె. అమలుకుమారి అన్నారు. బుధవారం మండలంలోని గణపవరం రైతు సేవా కేంద్రం నందు మండల స్థాయి వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖలు సర్ఫ్ సిబ్బంది , ప్రకృతి వ్యవసాయ శాఖలతో మండల స్థాయి సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె. అమల కుమారి మాట్లాడుతూ ప్రస్తుతం కాల పరిస్థితులు ప్రకారం క్రిమిసంహారాలు వాడటం వల్ల భూమి క్షీణించిపోయి, రసాయన పంట ఉత్పత్తులు తినడం వలన మానవజీవకోటికి ప్రమాదంగా మారిందని, ఈ తరుణంలో మనం భూమిని కాపాడుకునేందుకు రైతులందరూ ప్రకృతి వ్యవసాయ సాగు విధానమే శరణ్యంగా మారిందని ఆమె తెలిపారు. నవధాన్యాలు సాగు భూమికి ఎంతో బాగు అంటూ..మార్చి,ఏప్రిల్,మే మాసాలలో, రైతులందరూ పీఎండిఎస్ పద్ధతిని అవలంబించి వారి పొలాల సాగు చేయాలని పిలుపు నిచ్చారు. రైతులు 30 రకాల విత్తనాలతో పీఎండీఎస్ (ప్రీ మాన్ డ్రైసోయింగ్) పద్ధతిని పాటిస్తే భూములు సారవంతం అవుతాయని, కలుపు నివారణ జరుగుతుంది.భూమిలో కర్బన శాతం పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ పద్ధతిని ఖచ్చితంగా అవలంబించాలని తెలియజేశారు. మండల వ్యవసాయ అధికారి వెంకట నరసయ్య మాట్లాడుతూ ప్రస్తుతం రాజుపాలెం మండల పరిధిలో ఆయా గ్రామాల్లో ఎక్కువగా రైతులు మిరప పంటను సాగు చేస్తున్నారని, ప్రకృతి వ్యవసాయ విధానములో మిరప పంటలో రక్షణగా జొన్న సజ్జ, అదేవిధంగా అంతర్ పంటలు ఉల్లి ,బంతి, ముల్లంగి ,క్యారెట్, ఆముదం, పంటలు వేయడం వలన చీడపీడల ఉధృత తగ్గి భూమి సారవంతంగా మారుతుందన్నారు. ఏపిఎం శివకుమార్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రతి రైతు వారికున్న మొత్తం భూమిలో (పి ఎం డి ఎస్) విధానం ఆచరించాలని, ప్రతి గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల్లో ఉన్న రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకువెళ్లాలని, మహిళా సంఘాల్లోని సభ్యురాలు ఇంటి పరిసర ప్రాంతాల్లో కిచెన్ గార్డెన్ ఉండేవిధంగా చూడాలని, తెలిపారు.ఈ కార్యక్రమంలో అన్ని శాఖల వారు ముందడుగు వేస్తూ రైతులకు మరింత అవగాహన కల్పిస్తూ.. యుద్ధ ప్రాతిపదికన ఈ పీఎండీఎస్ పద్ధతిని ముందుకు తీసుకుని వెళ్లాలని తెలియజేశారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు, మోడల్స్, సాగు చేస్తున్నటువంటి, ప్రణతి, నర్రా మల్లికార్జునరావు, ఉత్తమ రైతుల కి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పల్నాడు జిల్లా లోని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల విజయ గాధ పుస్తకములను తెదేపా మండల కన్వీనర్ పెద్దిరాజు, మాజీ ఎంపీపీ నారా బాబురావు, చేతుల మీదగా ఆవిష్కరించటం జరిగింది.ఈ కార్యక్రమంలో క్రోసూరు డివిజన్ ఎంప్టీ జయలక్ష్మి, యూనిట్ ఇన్చార్జులు కే. జ్యోతి, టి .శ్రీనివాసరెడ్డి, ఎస్. రమణయ్య, ఆయా గ్రామాల వి ఏ ఏ లు, సీసీలు, వివో ఏలు,ఐ సి ఆర్ పి , రైతులు,పాల్గొనటం జరిగింది.