జనం న్యూస్- మార్చి 13- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- అంతర్జాతీయ పర్యాట కేంద్రం నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ఎస్టీ ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. మంగళవారం నాడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన రాత్రికి నాగార్జునసాగర్ కి చేరుకున్నారు. సాగర్ సందర్శనలో భాగంగా లాంచీలో సాగర్ జలాశయంలో పర్యటించిన అనంతరం, నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్ ను, ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం బుద్ధవనం చేరుకున్న చైర్మన్ బృందానికి బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్రలు స్వాగతం పలికారు. అనంతరం బుద్ధ చరిత వనములోని బుద్ధుని పాదాల వద్ద వందనం సమర్పించారు. ఆ తర్వాత బుద్ధ చరిత వనం, ధ్యానవనం, స్వపవనం, మహాసుపాన్ని వీక్షించారు. మహా స్థూపం లోని లోని ధ్యాన మందిరంలో కొద్దిసేపు గడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుద్ధ వనం మహా అద్భుతంగా ఉందని ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిన ప్రదేశం అన్నారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ బుద్ధవనం విశేషాలను వివరించారు. వీరితోపాటు ఎస్ టి ఎస్ సి కమిషన్ సభ్యులు కుసురం నీలాదేవి ,రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణ ,శంకర్ నల్గొండ జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ పిడి కోటేశ్వరరావు, స్థానిక ఎస్సై సంపత్ గౌడ్, ప్రోటోకాల్ ఆర్ ఐ దండా శ్రీనివాసరెడ్డి, నిరంజన్ తదితరులు ఉన్నారు.