జనం న్యూస్ జనవరి 13 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మాకరా సంక్రాంతి పురస్కరించుకుని ఆదివారం నాడు రాజు కలని దుర్గామాత గుడి ఎదురుగా నిర్వహించిన ముగ్గుల పోటీలు సందడిగా జరిగాయి. ప్రతీ ఏటా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కార్పొరేటర్ ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్న విషయం విదితమే. బాలానగర్ డివిజన్ పరధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు సాయంత్రమే ప్రాంగనానికి చేరుకున్నారు. వయోభేదం లేకుండా పాల్గొని అందమైన రంగవల్లులును తీర్చిదిద్దారు. ఒక్కొక్కరు పోటాపోటీగా వేసిన ముగ్గులు ముచ్చట గొలిపాయి. రకరకాల రంగులతో వేసిన చుక్కల ముగ్గులు నేలపైన హరివిల్లును తలపించాయి. వివిధ రకాల కాన్సెప్టులతో మహిళలు వేసిన ముగ్గులు స్థానికులను ఆలోచింప చేశాయి.
ఈ కార్యక్రమానికి బాలానగర్ సీఐ నర్సింహా రాజు, కెసిఆర్ సినీనిర్మాత రాకింగ్ రాకేష్ ముఖ్య అతిథిలుగా హాజరుకాగ ఎస్ఐ హాజీ మియా అతిథిగా హాజరయ్యారు. పోటీల్లో మహిళలు వేసిన ముగ్గులను అతిథులు తిలకించి అభినందించారు. మహిళల్లోని ప్రతిభను వెలికితీసేందుకు పోటీలు నిర్వహించడం అభినందనీయమని కార్పొరేటర్ రవీందర్ రెడ్డిని సీఐ నర్సింహా రాజు కొనియాడారు.అనంతరం సీఐ నర్సింహా రాజు మాట్లాడుతూ కార్పొరేటర్ రవీందర్ రెడ్డి చక్కటి వాతావరణంలో ముగ్గుల పోటీలు నిర్వహించారన్నారు, మన సాంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం మన బాధ్యత అని గుర్తు చేశారు. భావితరాలకు పండుగ సాంప్రదాయాలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కోరారు. ఇటీవల జరుగుతున్న సైబర్ నేరాలు, డ్రగ్స్ పై అవగాహనా కూడా కల్పించారు.ఈ ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా పంజా రాంచందర్, జెరూపొతుల రవీందర్,దండు రవి కుమార్, మొహమ్మద్ ఖాజా వ్యవహారించారు.అనంతరం సృజనాత్మకతతో మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించిన న్యాయ నిర్ణేతల బృందం ముగ్గురిని విజేతలుగా ఎంపిక చేసింది. వీరిలో మొదటి బహుమతి మన్నే శ్రీలత,రెండవ బహుమతి సుకన్య , మూడోవ బహుమతి ప్రవిళిక, నాల్గొవ బహుమతి సుమలత మరియు పోటీలో పాల్గొన్న ప్రతిఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందచేశారు . ..