జనం న్యూస్ మార్చ్ 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డైలీవేజ్ & ఔట్సోర్సింగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా నలుమూలల నుండి వర్కర్లు ఈ సమ్మెలో పాల్గొన్నారు ఈ సంధర్భంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ డైలీవేజ్ & ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కామ్రేడ్ వెలిశాల క్రిష్ణమాచారి మాట్లాడుతూ జి.ఒ 64 అమలు నిలిపివేయాలని. పాత పద్దతిలోనే జిల్లాకలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని. 212 జి.ఒ ను సవరించి 2014 నాటికి 5 సంవత్సరాల సర్వీస్ వున్న వారందరిని పర్మి నెంట్ చేయాలి. కొత్త మెనూ వల్ల పెరిగిన పనిభారానికి అనుకుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని అన్నారు వయస్సు మళ్ళిన వర్కర్ల కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, పూర్తికాలం పనిచేస్తున్న కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలని. మరణించిన కార్మికుల కుటుంబసభ్యులను డైలీవేజ్ వర్కర్లుగా నియమించాలని. విధ్యార్థులతో పాటు కార్మికులకు కూడా 2 జతల యూనిఫాం ఇవ్వాలని. ఎండాకాలం సెలవులలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 5 సంవత్సరాలు సర్వీస్ లో ఉన్న కార్మికులను పర్మినెంట్ చేయాలని కనీస వేతనం 26000 రూ'లు చెల్లించాలని, ఆదివాసీ గిరిజనుల ప్రధానమైన హోళీ పండుగను పురస్కరించుకుని పెండింగ్ వేతనాలు చెళ్ళించకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ డైలీవేజ్ & ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు టేకం ప్రభాకర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అడ శ్యాంరావు మేశ్రం సీతారాం జిల్లా నాయకులు సధాశివ్, ఇందు రమేష్,పతుబాయి, రాంబాయి మాన్కు వసంత్ రావ్, జంగూ, దివ్యా, మామిడి లక్ష్మీ, ఇతరులు పాల్గొన్నారు.