రేషన్ డీలర్ పై చర్యలకు ఉన్నత అధికారులకు నివేదిక… బిచ్కుంద మార్చి 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గుండె కల్లూరు రేషన్ షాపులో 39.66 క్వింటాల రేషన్ మాయం అయినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారి తనిఖీల్లో వెల్లడయింది. వివరాలకు వెళితే కొత్తగా గుండె కల్లూరు గ్రామంలో రేషన్ డీలర్ ప్రభుత్వం నియమించింది. గత కొన్ని రోజులుగా ఇన్చార్జిగా ఉన్న డీలర్ కొత్త డీలర్ కు రేషన్ షాప్ అప్ప చెప్పే సమయంలో రేషన్ బియ్యం లోటు ఉన్నదని అనుమానంతో తాసిల్దార్ కు కొత్త డీలర్ ఫిర్యాదు చేయడంతో బుధవారం నాడు ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఖరీద్, ఆర్ఐ రవీంద్రనాథ్ షాపులో తనిఖీ చేయగా 39 క్వింటాళ 66 కిలోలు రేషన్ బియ్యం మాయమైనట్లు గుర్తించి గుర్తించినారు. ఈ ఇంచార్జ్ డీలర్ పై చర్యలు నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తున్నామని తెలిపారు. వీరితోపాటు కొత్త డీలర్ గంగమని ఉన్నారు