జనం న్యూస్- మార్చి 14- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నందికొండ మున్సిపాలిటీ ప్రజలు హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని నాగార్జునసాగర్ టౌన్ ఎస్సై సంపత్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు, హోలీ పండుగను పురస్కరించుకొని నందికొండ మున్సిపాలిటీ ప్రజలకు పోలీస్ శాఖ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందికొండ మున్సిపాలిటీ ప్రజలందరూ పండగను ప్రశాంత వాతావరణంలో సాంప్రదాయాల నడుమ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించుకోవాలని సూచించారు, ముఖ్యంగా యువత మద్యం సేవించి వాహనాలను నడపరాదని, వాహనాలపై ముగ్గురు ప్రయాణించడం చట్టరీత్యా నేరమని, వాహనాలపై ప్రయాణించే వారిపై ఎటువంటి రంగులు చల్లరాదని తెలిపారు, సహజమైన రంగులనే వాడాలని రసాయనాలు కలిగిన రంగులను ఉపయోగించవద్దని తెలిపారు, యువత హోలీ పండుగ అనంతరం కృష్ణానది పరిసర ప్రాంతాల్లో స్నానాలు ఆచరించే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని ,ఈతరానివారు నదిలోకి దిగవద్దని సూచించారు, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను గమనించుకోవాలని ప్రశాంతమైన వాతావరణంలో పండుగను జరుపుకొని పోలీస్ వారికి సహకరించాలని కోరారు.