జనం న్యూస్ జనవరి 14 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరోకొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ. .డీవీ.శ్రీనివాస రావు , ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈస్గాం పోలిస్ స్టేషన్ లిమిట్స్ లో రాస్పల్లి గ్రామ శివారు లో ఉన్న పెద్దవాగు పరీవాహక ప్రాంతాలను అడ్డలగా చేసుకొని కొంత మంది కోడి పంద్యాలు నిర్వెయిస్తున్నారు అన్న నమ్మదగిన సమాచారం మేరకు సోమవారం టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్,ఎస్ఐ వెంకటేశ్ తో రెండు బృందాలుగా ఏర్పడి పెద్దవాగు పరీవాహక ప్రాంతంలో ఆడుతున్న వారి పై దాడిచేసినట్లు పట్టుకున్నట్లు సీఐ రాణా ప్రతాప్ తెలిపారు.దొరికిన వారిని పట్టుకోని విచారించగా అక్కడ నుండి కొంత మంది పోలీసు వారిని చూసి పారిపోయారు అనీ తెలిపనారు దొరికిన వారి వద్ద నుండి నాలుగు పందెం పుంజులు ( ఒక్కటి కత్తి గట్లు తగిలి చనిపోయి ఉంది).3020/- నాగదు మరియు 10 మోటర్ బైక్స్ మరియు 6 మొబైల్స్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకొని ఈస్గాన్ పోలిస్ స్టేషన్ లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్, సీఐ రాణా ప్రతాప్ తెలిపారు..