జనం న్యూస్ మార్చి 13 కూకట్పల్లి ప్రతిదీ శ్రీనివాసరెడ్డి బాలనగర్ డివిజన్ పరిధిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నందు సంకష్ట హర గణపతి సహిత విజయదుర్గ మాత గజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవము, మార్చ్ 4'వ తేదీన విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా, ఆలయ కమిటీ సభ్యులు మరియు కాలనీవాసులు అందరూ కలసి ఏర్పాటు చేసుకున్న ఆధ్యాత్మిక సమావేశంలో వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొని, సంకష్టహర గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆలయ అభివృద్ధిలో వారు చేస్తున్నటువంటి సహకారానికి ఆలయ కమిటీ సభ్యులు మరియు కాలనీ వాసులు అందరూ కలిసి కృతజ్ఞత భావంతో శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు ని ఘనంగా సన్మానించారు, అనంతరం రాజేశ్వరరావు కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరిని ఆత్మీయంగా పలకరిస్తూ కలిసి భోజనం చేశారు.