మునగాల మండల కేంద్రంలో గ్రామ శాలివాహన వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మొల్లమాంబ 585 వ జయంతి వేడుకలు రామాయణాన్ని సంస్కృతంలో నుంచి తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జనం న్యూస్ మార్చి 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రామాయణాన్ని సంస్కృతంలో నుంచి తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ 585 వ జయంతి వేడుకలను మునగాల గ్రామ శాలివాహన వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని అండర్పాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మునగాల శాలివాహన వెల్ఫేర్ సొసైటీ సభ్యులు మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి,స్వీట్లు పంచుకొని పుట్టినరోజు ఉత్సవాలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా శాలివాహన వెల్ఫేర్ సొసైటీ సభ్యులు మాట్లాడుతూ…మొల్లమాంబ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా గోపవరం గ్రామంలో కుమ్మరి కుటుంబంలో జన్మించిందని,ఆమె 16 వ శతాబ్దపు తొలి తెలుగు కవయిత్రి గా అనేక కవితలు రాసి, ప్రసిద్ధి చెందిన రామాయణమును తెలుగులో రాసిందని,16 వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల పాలనలో ఈమె సరళమైన తెలుగు భాషలో అనేక రచనలు చేసిందని ఆమె సేవలను మరియు ఆమె చరిత్రను,సాధించిన విజయాలను ఈ సందర్భంగా కొనియాడారు.