జనం న్యూస్ మార్చి 13 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)
రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్ధులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం. శ్రీనివాస రావు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఎస్.ఎస్.సి (పదో తరగతి) పరీక్షలకి హాజరయ్యే విద్యార్ధులు కేవలం వారి హాల్ టికెట్ ఆధారంగా ఏ విధమైన బస్సు పాస్ లేకపోయినా కూడా పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులలో ఈ నెల 17 వ తేదీ నుండి 31 వ తేదీ వరుకు పదో తరగతి పరీక్షలు ఉన్న రోజులలో ఈ ఉచిత ప్రయాణం చేయవచ్చునని ఆయన తెలిపారు. పరీక్ష జరిగే సమయంలోనే పదవ తరగతి విద్యార్థులు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయువచ్చునని కోనసీమ జిల్లా పరిధిలోని విద్యార్ధులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం. శ్రీనివాస రావు కోరారు.