జనం న్యూస్ జనవరి 14 (చిట్యాల మండలం ప్రతినిధి మహేష్ ).
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినెడు గ్రామం లో డివైఎఫ్ఐ మరియు ఎస్ ఎఫ్ ఐ ఆద్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే క్రీడా కార్యక్రమల ప్రారంభోత్సవంలో భాగంగా కబడ్డీనీ ఆటను సిపిఎం పార్టీ నాయకులు దేశ బోయిన నరసింహ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు యువతి, యువకులలో మానసిక ఉల్లాసాన్ని, క్రీడా నైపుణ్యాలు పెంపొందిస్తాయని అన్నారు. వేలిమినేడు గ్రామంలో ప్రతి సంక్రాంతి పండుగకి ఎస్ఎఫ్ఐ,డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో క్రీడలను నిర్వహిస్తున్న విద్యార్థి యువజన నాయకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బొంతల చంద్రారెడ్డి,నాతి వెంకటరామయ్య, సుర్కంటి మోహన్ రెడ్డి, ఆరూరి శీను, నెలికంటి నరసింహ,నాతి కిరణ్,పంది నరేష్, గోలి సాయికిరణ్, కూరాకుల బాలు, అంతటి ఆది,ఆరూరి ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.