జనం న్యూస్ మార్చి 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం గ్రామ పంచాయతీ ఆవరణలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పై కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలను చేసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు అన్నారు చదివాగు ప్రాజెక్టులో సరిపడా నీళ్ళు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రైతుల పక్షాన ధర్నా నిర్వహిస్తే ఆయన పై లేని పోని ఆరోపణలు సరికాదన్నారు ఆయన ఎక్కడ చేపల వ్యాపారం చేయలేదని అన్నారు చలివాగు ప్రాజెక్టు పంపు వద్ద అధికారులను బంధించి ధర్నా నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా అని ప్రశ్నించారు బి ఆర్ ఎస్ హయాంలో ఎక్కడ కూడా పంటలు ఎండ లేదుని అన్నారు చలివాగు ప్రాజెక్టు కట్ట మరమ్మతులకు 10 కోట్లు మాంజూరు చేయించింది మాజీ ఎమ్మెల్యేనే అని గుర్తు చేశారు ప్రస్తుత ఎమ్మెల్యే ప్రాజెక్టు నీటి విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు చెప్పాలని డిమాండ్ చేశారు ప్రాజెక్టులో 15 ఫీట్లు నీరు నిలువ ఉంచిన తర్వాతనే పంపింగ్ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ వైస్ చైర్మన్ దుదిపాల తిరుపతి రెడ్డి మండల యూత్ అధ్యక్షులు మారపల్లి మోహన్ ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ నందం మైలారం మాజీ సర్పంచ్ అరికిల్ల ప్రసాద్ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు రామ్ శెట్టి లక్ష్మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ బాబు దేవయ్య చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు…