బిచ్కుంద మార్చ్ 14 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున అప్ప షట్కార్ హోలీ పండుగ లో స్వయంగా పాల్గొని కార్యకర్తలకు రంగులు పూసి, హోలీ పండుగ శుభాాంక్షలు తెలియజేశారు. అప్ప మాట్లాడుతూ .ఈ రంగుల పండుగ హోలీని ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సవాల నడుమ సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిల్ సెట్ కార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్, మాజీ ఉప సర్పంచ్ నాగరాజు, మాజీ ఎంపీటీసీ గుండె కల్లూరు రాజీ పటేల్, బొగడ మీద సాయిలు, హాజీ బాల్రాజ్, మైనార్టీ నాయకులు ఖలీల్, గోపనపల్లి గంగారాం సార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు