జనం న్యూస్ మార్చి 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి ర వి శాయంపేట మండల కేంద్రంలోని చేనేత పారిశ్రామిక సహకార సంఘంలో అఖిలభారత పద్మశాలి సంఘ సమావేశం ఏర్పాటు చేశారు
శాయంపేట గ్రామ అధ్యక్షుడు బాసని ప్రకాష్ అధ్యక్షతన లో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా అఖిలభారత పద్మశాలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వడ్నాల నరేందర్ హాజరై మాట్లాడుతూ
రాష్ట్రంలోని చేనేత 50 సంవత్సరాలు నిండిన వారందరికీ ఆసరా పింఛన్ ఇయ్యాలని అర్హులైన ప్రతి ఒక్కరికి అంతోదయ రేషన్ కార్డులు ఇవ్వాలని తెలిపారు అఖిలభారత పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజగోపాల్ మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అఖిలభారత పద్మశాలి సంఘాన్ని 1921లో స్థాపించినాడని అప్పటినుండి శాఖ అనేక ఉప శాఖలుగా ఏర్పడి సహకార సంఘాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినారని త్యాగధనుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు
అఖిలభారత పద్మశాలి సంఘం తెలంగాణ పద్మశాలి ఉపాధ్యక్షుడు వెంగళ వేణుగోపాల్ మాట్లాడుతూ
జియో టాక్ తో సంబంధం లేకుండా మగ్గం వేసే ప్రతి కార్మికునికి వైద్య సదుపాయాలు అర్హులైన పేద వారందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని బీమా పథకాన్ని అందరికీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు అఖిలభారత పద్మశాలి సంఘం హనంకొండ జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలో అందరి సభ్యత్వాలు చేర్పించాలని సభ్యత్వ రుసుము పది రూపాయలు అని తెలిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ప్రత్యేక తెలంగాణ కొరకు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవిని వదులుకున్నాడని అంతటి త్యాగధనుడి మనం నిత్యం స్మరించుకుంటూ ఆయన బాటలో మనం అంతా కలిసిమెలిసి ఐక్యంగా నడవాలని కోరారు శాయంపేట గ్రామ నివాసి దిడ్డి రమేష్ హనమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందున ఆయనకు శాలువాతో సన్మానం చేసినారు అనంతరం ఆయన మాట్లాడుతూ పదవులు ముఖ్యం కాదని గతంలో నేను అనేక పదవులు అనుభవించానని చేనేత సంఘ అధ్యక్షులుగా పనిచేసిన అని వ్యవసాయ మార్కెట్ కమిటీ మెంబర్ గాను జిల్లా కోపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గా పని చేసినానని నాకు ఈ బాధ్యతను అప్పగించినందుకు రాష్ట్ర జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు నా శక్తి మేరకు పద్మశాలీల ఐక్యత కుల బంధువులకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు అనంతరం అఖిల భారత పద్మశాలి మండల కన్వీనర్ గా వంగరి సాంబయ్య ను
కో కన్వీనర్ పత్తి శీను బసాని సాయి తేజను పై నాయకత్వం నియమించినారు
అనంతరం పద్మశాలి సోదరులందరూ నినాదాలతో మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద చేరుకొని అర్షద్వనాలతో బాంబులు కాల్చినారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వల్పదాసు చంద్రమౌళి దాసరి సమ్మయ్య దిడ్డి ప్రభాకర్ బూర లక్ష్మీనారాయణ చిందం రవి వల్పదాసు వెంకటరమణ మంత్రి రమేష్ తదితరులు పాల్గొన్నారు….