గిద్దలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కుందురు నాగార్జున రెడ్డి. జనం-న్యూస్, మార్చి 14,(బేస్తవారిపేట ప్రతినిధి): ప్రకాశం జిల్లా, మార్కాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, కుందురు నాగార్జున రెడ్డి "జనం-న్యూస్" ప్రతినిధితో ముచ్చటిస్తూ ప్రజా సేవలో సమర్థతను చాటుకోవడం ఏ రాజకీయ నాయకుడికైనా మనసావాచా కర్మణా నమ్మాల్సిన సిద్ధాంతమని అనుసరించవలసిన రాజనీతి అని ఈ విషయంలో విలువలకు కట్టుబడి ఉండటం విశ్వసనీతను చాటుకోవడమే నా ధ్యేయమని చెప్పారు. నా రాజకీయ జీవితంలో నేను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పార్టీని కి విధేయులుగా ఉండే కార్యకర్తలలో, నాయకులలో విశ్వాసం కోల్పోకుండా వారికి తగిన న్యాయం చేయడం నా కర్తవ్యం గా భావిస్తానని చెప్పారు. ప్రజలకు సేవ చేయడంలో, వారి అవసరాలు తీర్చడంలో సమర్థవంతంగా పని చేయాలని అలా పని చేయలేని రోజు రాజకీయాలు అవసరమలేదని చెప్పారు. నేను రాజకీయాలలోకి వచ్చింది సంపద సృష్టికోసం కాదని ప్రజలకు నిరంతరం సమర్థవంతంగా, అవినీతి రహితంగా, ప్రజా సేవ చేయడానికి పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు, నాయకులకు, ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేయడం నా రాజకీయ విధానము అని తెలిపారు. ప్రజలలో నాయకులు పై విశ్వాసం ఉండటం ముఖ్యమని తెలిపారు. మన వెంట మన అడుగుజాడల్లో నడిచే ప్రతి కార్యకర్త, నాయకులు మనపై విశ్వాసం కల్పించే బాధ్యత రాజకీయ నాయకులపై ఉంటుందని తెలిపారు. ఒక నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలు ప్రజలు మనల్ని ఎన్నుకొని శాసనసభకు పంపిస్తున్నారంటే ప్రజలకు మనపై విశ్వాసము నమ్మకము ఉన్నాయని మనం గ్రహించాలి. శాసనసభ్యులు గా ఎన్నికైన తర్వాత మనము కూడా ప్రజలకు అదే విశ్వాసంతో అవినీతి రహితంగా, వారికి సేవ చేయడం, వారి అవసరాలు తీర్చడం, వారు ఉండే ప్రాంతాలు అభివృద్ధి చేయడం, వారు ఉండే ప్రాంతాలు ఏ సమస్య వచ్చిన తక్షణమే స్పందించడం, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడం, వలన ప్రజలలో మనపై పూర్తి విశ్వాసం నమ్మకం కలుగుతుందని మనము ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మనల్ని గౌరవిస్తారని తెలిపారు. నా రాజకీయ విధానం పార్టీ కి కష్టపడి పనిచేసే కార్యకర్తలకు, నాయకులకు, ప్రజల పట్ల విశ్వసనీతగా ఉండడం, విలువలకు కట్టుబడి రాజకీయాలు చేయడం నా విధానం అని తెలిపారు. నా ధ్యేయం నేను ఏ నియోజకవర్గంలో ఉంటే ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కార్యకర్తలు నాయకుల క్షేమం కోరుతూ ప్రజాసేవ చేయడం, అవినీతి రహిత పరిపాలన అందించడం, నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవ చేయడమే నా అంతిమ లక్ష్యమని తెలిపారు..