సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయండి : కొండేటి శ్రీను *
జనం న్యూస్: 14 జనవరి 2025 నిడమనూరు మండలం, నల్లగొండ జిల్లా, బొంగరాల శ్రీనివాస్ ప్రతినిధి.
జనవరి 25, 26, 27, 28వ తేదీలలో సంగారెడ్డి పట్టణంలో నిర్వహిస్తున్న సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయడానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను నిడమనూరు మండల కేంద్రంలో 2వ రోజు ఇంటింటికి మాస్ ఫండ్ క్యాంపెయిన్ నిర్వహించారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కోమండ్ల గురువయ్య, వింజమూరి శివ, ముత్యాల కేశవులు తదితరులు పాల్గొన్నారు.