.సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం.దినకర్. జనం న్యూస్ మార్చ్ 14 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ప్రభుత్వం .గిరిజన ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న వర్కర్లకు వేతనాలు చెల్లించాలని ఆశ్రమ పాఠశాల కార్మిక సంఘం( సీఐటీయూ ) ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెకు నేడు మూడవ రోజు సమ్మె శిబిరాన్ని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం.దినకర్ సందర్శించి కార్మికులకు సీపీఎం పార్టీ ఎల్లప్పుడూ అండ దండగ ఉంటుందని ధైర్యం ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ 7 నెలల వేతనాలు రాకుంటే కార్మికులు వారి కుటుంబాలు ఎలా బ్రతకాలని అన్నారు హోలీ పండుగ రోజు కూడా కార్మికులు సమ్మెలో ఉన్నారంటే జిల్లా అధికారులు రాష్ట ప్రభుత్వం ఏం చేస్తుందని అన్నారు కార్మికుల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలనీ ఇఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు చెల్లించాలని,ఐదు సంవత్సరాల సర్వీసు ఉన్నా వారిని పర్మినెంట్ చేయాలని,పని చేస్తున్న కార్మిక కుటుంబాల వారసులకు ఉద్యాగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు