జనం న్యూస్, మార్చ్ 15,(తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ బడులను ఒంటిపూట నడపాలని విద్యశాఖ నిర్ణయం తీసుకుంది, విద్యా సంవత్సరం ముగిసే వరకు ఒక్క పూట బడులు కొనసాగనున్నట్లు విద్యా శాఖ తెలిపింది. ప్రతి రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు స్కూల్స్ పని చేయనున్నా యి. ఇక పదవ తరగతి పరీక్ష కేంద్రాల్లో ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు క్లాసులు జరగనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా ఎండ లు మండిపోతున్నాయి.
రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉండటం తో ఈ పరిస్థితులను దృష్టి లో పెట్టుకుని విద్యాశాఖ ఒంటి పూట బడులు నిర్వహించడానికి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
2025 మార్చి పదిహేనవ తేదీ నుంచి ఈ ఒక్క పూట బడులు కొనసాగనున్నట్లు తెలిపారు. ఉదయం 12:30 మధ్యాహ్న భోజనం నిర్వ హించనున్నారు ఇక లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ ఇరవై ముడవ తేదీ వరకూ ఒంటి పూట బడులు కొనసాగనున్నా యి.