జనం న్యూస్ 15 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో నూతనంగా ఏర్పడిన శక్తి టీమ్స్ పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, ముఖ్య కూడళ్లు, కళాశాలలను శుక్రవారం సందర్శించారు. మహిళలు, విద్యార్థినులకు శక్తి మొబైల్ యాప్ పట్ల విస్తృతంగా అవగాహన కల్పించారు. మప్టీలో వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ, మహిళలకు రక్షణగా నిలిచే చట్టాలు, యాప్ పనితీరు పట్ల అవగాహన కల్పించారు. మహిళలతో యాప్ డౌన్లోడ్ చేయించారు.