జనం న్యూస్ 15 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం నగర పాలక సంస్థ గురజాడ నగర్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. గురజాడ నగర్లో శుక్రవారం సీపీఎం ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. పేదల నివాసముంటున్న గురజాడ నగర్లో కాలువలలో పూడికలు తీసి మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జీవో 30 అమలు చేసి పేదలు నివాసమున్న చోట ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నేతలున్నారు.