జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 15. భుత్వం కనీసం మద్దతు ధరపై కందులు కొనుగోలు కేంద్రంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాని ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి, కూటమి నాయకులు చేతులు మీదుగా కొబ్బరికాయ కొట్టి కందులు కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు. ఈ సందర్భంగా పి ఏ సి ఎస్ స్పెషల్ ఇంచార్జి కే.వెంకటేశ్వర్లు రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపిట వేసిందని, రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, కాబట్టి రైతులు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనె కందులు విక్రయించి క్వింటాకు రూ.7550 మద్దతు ధర పొందాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టి.వెంకటేశ్వర్లు, జనసేన పార్టీ నాయకులు జి.రత్నకుమార్, టిడిపి నాయకులు ఈర్ల. వెంకటయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు గౌతకట్ల సుబ్బయ్య, ఈర్ల పెద్ద కాశయ్య కాలంగి.శ్రీనివాసులు, గోసు నరసింహగోసు వెంకటేశ్వర్లు,,బిజెపి మండల పార్టీ అధ్యక్షులు గాయం లక్ష్మీరెడ్డి, టిడిపి, జనసేన నాయకులు గుంటు ప్రేమ్ కుమార్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.