న్యూస్: మండలంలోని నాగేళ్ళమూడుపు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు,పెర్వల్ పార్టీ నీ ఘనంగా నిర్వహించారు. ఈ సభను ఉద్దేశించి పాఠశాల హెడ్మాస్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం మొదటి సారిగా పాఠశాల తరుపున పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థి, విద్యార్థినులకు సూచనలు సలహాలు ఇచ్చారు. భవిష్యత్తులో చదువుపై దృష్టి పెట్టి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు.అలాగే ఈ కార్యక్రమానికిముఖ్యఅతిథిగా వచ్చిన పాఠశాల విధ్యకమిటి చైర్మన్ పాఠశాల అభివృద్ధి కి తన వంతు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. మరియు పాఠశాల సోషల్ ఉపాధ్యావుడు సిరిగిరి కుమార్ పిల్లలకు ప్రోత్సహంగా బహుమతులు దజేశారు.విద్యకమిటి చైర్మన్ పదవతరగతి మొదటి శ్రేణి,ద్వితయశ్రేణి లేదా మంచి మార్కులు సాధించిన వారికి తగిన బహుమతి అందజేస్తాం అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు,తల్లిదండ్రులు, హిందీ, ఉపాధ్యువురాలు, తదితరులు పాల్గొన్నారు.