జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రంజాన్ ఆరంభం సందర్భంగా నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని గాంధీనగర్ (తోట పాలెం) లోని 23 ముస్లిం మైనార్టీ నిరుపేదలకు మండల ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మౌల, పఠాన్ మెహర్ ఖాన్ రంజాన్ తుఫా అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం కుటుంబం రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఉద్దేశంతో ఈ రంజాన్ తోఫా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. నందలూరు మండలంలో ప్రతి ముస్లిం కుటుంబంతో పాటు పేద ధనిక విభేదాలు లేకుండా అందరూ సంతోషంగా రంజాన్ పండుగను జరుపుకోవాలని తమ ఉద్దేశమని అన్నారు ఇదేవిధంగా మండలంలోని ప్రతి పల్లెలో రంజాన్ తోఫా కార్యక్రమాన్ని పూర్తి చేసి రంజాన్ పండుగను అందరూ సంతోషంగా జరుపు కునేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు అదేవిధంగా తమ స్నేహితులు, బంధువులు, నాయకుల సహాయ సహకారాలతో మండలంలోని ప్రతి పల్లెలో పేద కుటుంబాలను ఎంపిక చేసి వారికి పండుగకు కావాల్సినటువంటి 15 రకాల సరుకులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా ఈ కార్యక్రమంలో పార్టీలకు, కుల మతాలకు అతీతంగా సహాయ సహకారాలు అందజేసి వారు కూడా పాలుపంచుకోవచ్చు అని తెలిపారు.