జనం న్యూస్ మార్చి 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని
రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక కు హాజరైన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఈరోజు శుక్రవారం సాయంత్రం 6:15 గంటలకు శాయంపేట మండల కేంద్రంలోని మదీన మజీదులో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సొంత డబ్బులతో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో స్థానిక మండల కాంగ్రెస్ నేతలతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్యే అన్నారు. అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని, మనషులంతా సోదర భావంతో ఉండాలన్నారు. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ముస్లిం సోదర, సోదరీమణులందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉపవాస దీక్షలో పాల్గొనాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ఎమ్మెల్యేకు పలువురు ముస్లిం సోదరులు శాలువాలు కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి మాజీ జెడ్పీటీసీ చల్ల చక్రపాణి కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ హైదర్ ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…..