పట్టించుకోని అధికారులు,దృష్టి పెట్టని లైన్మెన్లు జనం న్యూస్,మార్చ్ 15,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ నుంచి డోంగ్ బాన్సువాడ మధ్యలో సీఏ పైప్ లైన్ లీకేజ్ అవుతున్న చూసి చూడనట్లు పట్టించుకోని మిషన్ భగీరథ వాటర్ సప్లై లైన్మెన్లు అధికారులు. తీవ్రతరమైన మండుతున్న ఎండల్లో త్రాగునీరు సరఫరా అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో పైప్ లైన్ లీకేజీలను చూసుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీని బాగు చేసి ఆయా గ్రామాల ప్రజలకు నీటి సరఫరాను సక్రమంగా చెయ్యాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.