జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 15. వేసవి కాలంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయటం హర్షించదగ్గ విషయమని శ్రీశైలం వాసవి సముదాయ సత్ర సభ్యులు పోలేపల్లి.జనార్దన్ రావు అన్నారు. శుక్రవారం తర్లుపాడు శిరిడి సాయి మందిరం ఆవరణలో ఆలయ చైర్మన్ మాదాల. నాగ మల్లికార్జున ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని పోలేపల్లి.జనార్ధన్ ప్రారంభించారు. అనంతరం జనార్దన్ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు గ్రామాలలో, రహదారులలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. రిటైర్డ్ టీచర్ కోలగట్ల. నారాయణరెడ్డి, నెహ్రు యూత్ అధ్యక్షులు బెడుదూరి. పుల్లయ్య, కుందూరు. పెద్ద కాశిరెడ్డి, మాదాల. శంకర్, కోటేశ్వరరావు, గాలి. రంగారెడ్డి పాల్గొని పానకం పంపిణీ చేశారు.