జనం న్యూస్ మార్చ్ 15 ఈ నెల 16 నుండి 22 వరకు భూటాన్ దేశంలో నిర్వహించే అంతర్జాతీయ బౌద్ద సమ్మేళనానికి వాంకిడి వాసి,భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహుల్కార్ ఎంపికయ్యారు.భారత దేశం నుండి హజరవుతున్న 35 మంది డెలిగెట్స్ లతో పాటు,ఆసిఫాబాద్ జిల్లా తరపున హజరవుతున్నట్లు తెలిపారు.ఈ సమ్మేళనంలో వారం రోజులపాటు భగవాన్ బుద్ధుదు,బౌద్ద మత సిద్ధాంతలపై శిక్షణ ఉంటుందని,అనంతరం బౌద్ద గురువు లతో కలసి బౌద్ద అరామాల సందర్శన ఉంటుందని పేర్కొన్నారు.ప్రపంచంలో అత్యంత ఆనందకరమైన దేశంగా వరల్డ్ మ్యాప్ ఆఫ్ హ్యాపీనెస్ 2000 గా గుర్తించబడిన సందర్భంగా చివరి రోజు ఆ దేశ రాజుకు ఇంటర్నేషనల్ బుద్ధిష్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఉండే అభినందన సభలో పాల్గొంటున్నట్లు తెలిపారు.