జనం న్యూస్ మార్చి 15(నడిగూడెం) మండల కేంద్రంలో గల కొల్లు పాపయ్య జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు నడిగూడెం బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బోనగిరి ఉపేందర్ ఆధ్వర్యంలో శనివారం ప్యాడ్లు, పెన్నులు, పరీక్షా సామాగ్రి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బోనగిరి ఉపేందర్ మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా, ఇష్టంతో పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకొని,చదువుకున్న పాఠశాలకు, గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి కాసాని సతీష్, షేక్ జలీల్, తంగేళ్ల లింగయ్య,పుట్టపాక ఉదయ భాస్కర్, కన్నెబోయిన మురళీకృష్ణ, అమరబోయిన సైదారావు, నక్క మహేష్, బొమ్మన బోయిన చందు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, కరుణ ఉపాధ్యాయులు శోభన్ బాబు, మీరాజుద్దీన్, పర్వతాలు, శ్రీనివాస్ రెడ్డి, చైతన్య అరుణ, జ్యోతి, హరిత,సునీత, సరిత, కల్పన, తిరుమల, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.