జనం న్యూస్- మార్చి 16- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీ స్టేషన్ మొత్తం సస్పెండ్ చేయటాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ శ్రేణులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు, బిఆర్ఎస్ నాయకుడు మాజీ కౌన్సిలర్ హిరేకర్ రమేష్ జి మాట్లాడుతూ ప్రతిపక్ష బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పలేక కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా సస్పెండ్ చేయటం జరుగుతుందని ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడే హక్కు అందరూ ఎమ్మెల్యేలకు ఉంటుందని తెలిపారు కానీ తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతుందని అన్నారు, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ప్రతిపక్ష పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు, ప్రభుత్వం గత 15 నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రతిపక్షాలను అణగదొక్కే చర్యలకు దిగుతుందని, బిఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్యమ పార్టీ అని పార్టీ శ్రేణులకు అరెస్టులు కొత్త ఏమీ కాదని స్థానిక ఎన్నికల్లో ప్రజలే ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్తారని అన్నారు, ఈ కార్యక్రమంలో నాయకులు సభావాత్ చంద్రమౌళి నాయక్, లక్ష్మణ్ నాయక్, మక్సుద్, జిలాని ,శేఖర్ ఆచారి, నకరికంటి సైదులు, సత్యనారాయణ, సతీష్, అంజయ్య, పిట్టా సైదులు, దావీదు, వెంకటేశ్వర్లు, కోటియా నాయక్, కేదారి మరియా, దుర్గ, కండెల సుగుణ,, కండెల రమణ, కేదరి మారయ్య, రామావత్ సక్రిబాయ్, తదితరులు పాల్గొన్నారు.