ధ్వజస్తంభం ప్రతిష్టపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడా విజయ శేఖర్ రెడ్డి జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని గొల్లపల్లి గ్రామంలో శ్రీ గణపతి శ్రీకృష్ణ శ్రీ సీతా లక్ష్మణ హనుమ సమేత శ్రీరామచంద్ర స్వాములు వారి ధ్వజ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమనికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఆలయ కార్యనిర్వాహకులు గొబ్బిళ్ళ సుబ్బరాయుడు,పి శివయ్య ,జి.నాగయ్య ,జి పతి,పి.ఆదినారాయణ,జి.నాగభూషణ,పి.గుణయాదవ్ పి.ప్రభాకర్,బి.శ్రీధర్ యాదవ్ ఆయనను శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.అనంతరం వేద పండితులు బ్రహ్మశ్రీ బండాత్మకూర శివ కుమార్ శర్మ(స్మార్త పండితులు) సరసా రవి కుమార్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించి మేడా విజయ శేఖర్ రెడ్డి ని ఆశీర్వ దించారు .అనంతరం స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. . ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులను కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ మేజర్ సర్పంచ్ జంబు సూర్యనారాయణ, టంగుటూరు ఎంపీటీసీ పెంచలయ్య, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర గిరిజన మోర్చ్ అధ్యక్షులు పోతురాజు మస్తానయ్య, కోనాపురం ఉపసర్పంచ్ పుల్లయ్య, రాజంపేట పట్టణ తెలుగు యువత అధ్యక్షులు రాము యాదవ్,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు విశ్వనాథ్,మండెం నాగరాజు,కనకుర్తి వెంకటయ్య,సిరిసాల నాగేంద్ర,జీవ మస్తాన్,తుంటి రమణయ్య,షేక్ మౌలా,పఠాన్ మెహర్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.