జనం న్యూస్ మార్చ్ 16 కోటబొమ్మాళి మండలం: అధికారులు పారిశుద్య కార్మికులకు సరైన ఆదేశాలు ఇచ్చి పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలని మండలం కొత్తపేట గ్రామ ప్రధాన రహదారిలోని వ్యాపారులు, గ్రామస్థులు ఎంపీడీవో కె. ఫణీంద్రకుమార్ దృష్టికి తీసుకువచ్చారు. శనివారం జరిగిన స్వచ్చంద్ర, సర్ణాంద్ర కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆదికారులు ముందు పారిశుభ్రత గూర్చి వివరించారు. ముఖ్యంగా పారిశుద్య కార్మికులు నెలకు ఒక సారి వచ్చి రోడ్డు శుభ్రపరిచి చెత్తను తొలగిస్తున్నారని, ఆ తరువాత చెత్తకుప్పలకు అగ్గి మంటలు వేసి వెళ్లిపోతున్నారని వారు తెలిపారు. షాపులు నుంచి వారికి ప్రతీనెల డబ్బులు కూడా ఇస్తున్నామన్నారు. ఏదిఏమైన అధికారులు పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలని వారు అంతా కోరారు.