జనంన్యూస్. 16. నిజామాబాదు. ప్రతినిధి. ప్రముఖకవి, రచయిత హెచ్ ఆర్కే. గొర్రెపాటి మాధవరావు. పుస్తక పరిచయ సభ కోటగల్లి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్టు (గ్రంథాలయం) ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ పరిచయ సభ నిర్వహణ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్టి , సీనియర్ న్యాయవాది వి. సంగం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ కవి, రచయిత హెచ్ ఆర్కే మాట్లాడుతూ హైదరాబాద్ లో లా చదువుతున్నప్పుడు ఎప్పుడు బయట ఉంటావు ఉద్యమంలో ఎప్పుడు లా పుస్తకాలు చదువుతావు అని మాధవరావు అడిగితే పుస్తకాలను ఏముందు ఎప్పుడైనా చదవొచ్చు కానీ ముందు ప్రజల జీవితాలను ముందు చదువుదాం అన్న అని అనేవారు అంత గొప్ప మేధావి మా మాధవ అన్నారు. ఐక్యత ఘర్షణ లేనిది ఏ ఉద్యమం ఉండదు అని ఇద్దరం అనుకునే వాళ్ళం, అదే వాస్తవం విప్లవ ఉద్యమంలో ఇవి లేకుండా సజీవంగా ఉండలేవు అన్నారు. రష్యా ఉక్రెయిన్ రెండు దేశాల ఉద్యమం కాదు అది కేవలం అమెరికా చేయిస్తున్న ఉద్యమం అని, దాని ప్రయోజనాలు దానికి ఉన్నాయి అన్నారు. ప్రపంచంలో చాలా దేశాల్లో రెండు దేశాల మధ్య గొడవలు జరుగుతున్నాయి అంటే అది అమెరికా ఆధిపత్యం కోసం ఆ దేశం పై ఆధార పడటానికి, ఆ దేశాల్లో ఉన్న సహజ సంపద, చమురు, ఖనిజాలు దోచుకోవడానికి, ఆయుధాలు అమ్ముకోవడానికే అన్నారు. ఎలాన్ మాస్క్ కు ట్రంప్ బానిస, ట్రంప్ కు మోడీ బానిస, మోడీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి బానిస అని దాని కోసమే పని చేస్తారు కానీ ప్రజా ప్రయోజనాల కోసం కాదని అది అంత బూటకం అన్నారు. మాధవ రావు ప్రజల పట్ల ఎంత నిబద్ధత గల వ్యక్తి అంటే తను తీసుకున్న నిర్ణయం (అంశాల) పట్ల ఎంతో కమిట్మెంట్ తో చివరి వరకు నిలబడే వ్యక్తి అని కొనియాడారు. ఆయన దేశంలోనే ఒక కేసు ద్వారా సంచలనం కలిగించిచర్చను తీసుకు వచ్చిన వ్యక్తి మాధవ రావు.అన్నారు. న్యాయవాదిగా, హక్కుల కార్యకర్త గా ఒక సామాన్య వ్యక్తిగా ఉండే వారు అని తెలిపారు. ఆయన మరణం ప్రజలకు తీరని లోటని, ఒక స్నేహితుడిగా మాకు తీవ్ర వేదనను మిగిల్చి వెళ్ళిపోయాడు మా మాధవ అని ఆవేదన చేదారు. మరో అతిథి శాతవాహన యునివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వినాయక రెడ్డి. మాట్లాడుతూ విధానాల పరంగా అభిప్రాయాలు చెప్పడంలో మాధవ రావు నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా మాట్లాడేవారు అని అన్నారు. హక్కుల రంగంలో తనది చెరగని ముద్ర వేసుకున్నరని గుర్తు చేశారు. వామపక్షాల, ప్రజాసంఘాల ఐక్యత కమిటీలో నేను ఉన్నపుడు మాధవ రావు ఐక్యత దాని ఆవశ్యకత పై నిరంతరం చర్చించే వారు అందరూ ఐక్యం కావాలని మాలాంటి ప్రొఫెసర్ లు మధ్యవర్తిత్వం చేయాలనే వారు. దేశంలో మతోన్మాదం మత్తులో ఎంతో మంది మహిళలను చరిచిన, హత్యలు చేసిన అవి బయటకు రాకుండా పాలక పక్షాలు మీడియా పని చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడో ఒకసారి అక్కడ అక్కడ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి కానీ, మిగతా కేసుల్లో బాధితులను వారి కుటుంబ సభ్యులను చంపిన ఘటనలు దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తరచుగా జరుగుతున్నాయి అన్నారు. మాధవ రావుకి దేశంలోని అన్ని విషయాల పట్ల విశాల అవగాహన ఉన్నవ్యక్తి అని ఆర్థిక రంగం నుండి సాంస్కృతిక రంగం వరకు అపార పరిజ్ఞానం ఉన్న వ్యక్తి మాధవ రావుకి దక్కింది అన్నారు. భిన్న అభిప్రాయాల్ని స్వీకరించే గొప్ప మేథావి మాధవ రావుది. పొద్దు దినపత్రిక మాజీ సంపాదకులు బైస రామదాసు మాట్లాడుతూ విజ్ఞాన భాండాగారం మాధవ రావు గారు అని, అలాంటి వ్యక్తి ఒక గ్రంథాలయాన్ని నడిపించడం లో ఆయన కృషి చాలా గొప్పది అన్నారు. శ్రామికుల కాలనీలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచి ఉచితంగా చదువుకోవడానికి దోహదపడటం చిన్న విషయం కాదన్నారు.
ఈ సభలో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్టి ఆకుల పాపయ్య, తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పిట్ల సరిత లు ప్రసంగించారు. , జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్టీ డాక్టర్ రాం మోహనరావ. గ్రంథాలయానికి పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో కృష్ణా గోపాల రావు, వి సంగం, వి భాస్కర్, పరుచూరి శ్రీధర్ , నీలం సాయి బాబా, ఎల్ బి రవి, ఎం శివ, మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంగులు, రమేష్, ఆకుల అరుణ, వి భూమయ్య, దాసు, రాజేశ్వర్ , గొర్రెపాటి మాధవ రావు జీవిత సహచరి మీనా సహాని, కూతురు మధుమిత,కవులు , కళాకారులు, ప్రజాసంఘాల నాయకులు సాయరెడ్డి, సత్యం, సిర్ప లింగం, బి నాగభూషణం, సల్ల సత్యనారాయణ, మరియు జర్నలిస్టు లు తదితరులు పాల్గొన్నారు.