జనం న్యూస్ 16 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరంలోని GST కార్యాలయాన్ని రాష్ట్ర జీఎస్టీ కమిషనర్, జిల్లా ప్రత్యేకాధికారి ఏ.బాబు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో పన్ను వసూళ్లపై చర్చించారు. రాష్ట్ర రెవెన్యూ పెంపుపై కొన్ని మార్గదర్శకాలను ఆయన అందజేశారు. మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని సూచించారు. ప్రభుత్వానికి రావలసిన రెగ్యులర్ రిటర్న్, బకాయి పన్నుల వసూలు చేయాలన్నారు