జనం న్యూస్ 16 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఖేలో ఇండియా పోటీలకు విజయనగం జిల్లాకు చెందిన క్రీడాకారులు ఎంపిక అయ్యారని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ మాట్లాడుతూ… చెన్నైలో జరిగిన పారా ఒలింపిక్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ప్రతిభ కనబరచిన లలిత, దొగ్గ దేముడు నాయుడు, దినేష్ ఢిల్లీలో ఈనెల 20 నుంచి 23 వరకు జరుగనున్న ఖేలో ఇండియా క్రీడా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.