జనం న్యూస్ జనవరి 14 (చిట్యాల మండలం ప్రతినిధి మహేష్ ).
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని సీతారామచంద్ర స్వామి ఆలయం వద్ద సోమవారం ఉదయం భోగి పండుగ సందర్భంగా బిజెపి నల్గొండ జిల్లా కౌన్సిలర్ నెంబర్ అంశల అనిల్ కుమార్ తన 8వార్డు సభ్యులతో కలిసి పాత జ్ఞాపకాలు ఈ భోగి మంటలో వేసి కొత్తదనంతో సంక్రాంతి నీ ప్రారంభం చేస్తు భోగిమంటల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ రామచంద్రస్వామిని వేడుకున్నాడు.