జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 16 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పొట్టి శ్రీరాములు త్యాగాలు మరువలేనివి అని ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. ఆదివారం పట్టణంలోని భాస్కర్ సెంటర్లో ఉన్న పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపడం పట్ల హర్ష వ్యక్తం తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన కాళ్లకు చెప్పులు లేకుండా,నెత్తిన గొడుగు లేకుండా, జాతీయ ఉద్యమంలో ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. హరి జనోద్ధరణకు నడుము బిగించి, దేశ భాషల సమున్నతకు పోరాడిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర విముక్తి కోసం 58రోజులు నిరాహార దీక్ష చేసిన మహనీయులని అటువంటి వ్యక్తుల త్యాగాల స్ఫూర్తిని ఈ తరం యువతరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆంధ్ర రాష్ట్ర సిద్ధికై ఆత్మార్పణ చేసిన
మొట్టమొదటి ఆంధ్రుడు పొట్టి శ్రీరాములు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన వారిలో పొట్టి శ్రీరాములు ఒకరని తెలిపారు. ప్రస్తుత కాలంలో అలాంటి నిజాయితీపరులు పట్టుదల గల వ్యక్తులు పోరాట యోధులు ఎక్కడ దొరకరని, ఇలాంటి మహెున్నతమైన వ్యక్తి జయంతి వేడుకలను విద్యార్థులు, యువకులు, రాజకీయ నాయకులు, మేధావులు, విద్యావేత్తలు ఘనంగా జరుపుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో బి. శ్రీను నాయక్, పాలపర్తి శ్రీనివాసరావు,తాడిబోయిన వీరేంద్ర నాథ్,కంచర్ల శ్రీనివాసరావు, కె.రామాంజనేయులు, కొర్నేపాటి నాగరాజు, చందవరం హరిప్రసాద్,ఉప్పు మణికంఠ,ఆర్. మోహన్ నాయక్,బి.బంగారు నాయక్,షేక్. వలితో పాటు నాయకులు పాల్గొన్నారు.