జనం న్యూస్ 17 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో మంగళవారం, బుధవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదుయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, గరివిడి, గుర్ల, ! కోట, మెంటాడ, మెరకముడిదాం, రాజాం, రామభద్రాపురం,సంతకవిటి, తెగ్గాం, వంగర, L కోట మండల్లో 40 డిగ్రీల నమోదు అవ్వొచ్చని పేర్కొంది. వడగాల్పులు సైతం వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.