జనం న్యూస్ మార్చి 17 కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం
కాట్రేనికోన ఎస్సై అవినాష్ సోమవారం ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వేగంగా ఇతర వాహనాలతో పోటీ పడరాదని, డ్రైవర్ పక్కన ప్రయాణికులను ఎక్కించుకోరాదని, ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవినాష్ సూచించారు. ఎక్కువగా చైన్ స్నాచింగ్ కేసులు వస్తున్నాయని, ఈ విషయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, దొంగతనాల వైపు దృష్టి సారించాలని సూచించారు.