జనం న్యూస్, మార్చి 18, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) జగదేవపూర్ మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన కోడకండ్ల సాయి కిరణ్ వారం రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే కాగా సోమవారం స్థానిక గ్రామ మాజీ ఉప సర్పంచ్ సిద్దులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం కుటుంబానికి అండగా నిలిచి 50కిలోల సన్న బియ్యం నిత్య వసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయి కిరణ్ మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పారు.సాయి కిరణ్ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటానని చెప్పారు.యువత ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు, మనం సంపాదించిన దాంట్లో లేని తృప్తి ఇలాంటి సేవ చేయడంలోనే సంతృప్తి ఆనందం కలుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ భజరంగ్ దళ్ యూత్ సభ్యులు ప్రశాంత్,రాఖి,నాగుల్,శ్రీను,కార్తీక్,బన్నీ,సన్నీ,బాల్ రాజు,దిలీప్,రాజు,వెంకట్,అంజి,తదితరులు పాల్గొన్నారు.