జనం న్యూస్ జనవరి 13(నడిగూడెం)
మహిళల ఆర్థికాభివృద్దే తెలంగాణ ప్రజా ప్రభుత్వం లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బూత్కూరి వెంకటరెడ్డి అన్నారు. మండలంలోని గ్రామాల్లో మహిళలకు రాష్ట్ర మంత్రివర్యులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,
కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ల ఆదేశానుసారం సోమవారం కోదాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు నడిగూడెం మండలానికి సంబంధించిన మహిళలకు ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్స్ కాపీలను అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు ముదిరెడ్డి నళిని వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవబత్తిని రమేష్ ప్రసాద్, రామిని విజయవర్ధన్ రెడ్డి, గోపాలదాసు గోవిందు, పోలంపల్లి వీరయ్య,ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు,మహిళలు, తదితరులు పాల్గొన్నారు..