జనం న్యూస్ మార్చి 17 నడిగూడెం నడిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో సీపీఎం పోరుబాట సర్వేలో గుర్తించిన ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆ పార్టీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా చేపట్టి అనంతరం తహశీల్దార్ కు వినతి పత్రం అందించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు పాల్గొన్నారు.