జనం న్యూస్ 18 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక పకడ్బృంధీగా పదోతరగతి పరీక్షలను నిర్వహించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. సోమవారం నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో, పలు పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ముందుగా కంటోన్మెంటులో సెయింట్ ఆన్స్ బాలికోన్నత పాఠశాలను, మున్సిపల్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. తరగతి గదులను పరిశీలించారు.