జనం న్యూస్ మార్చ్ 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మూలపేట పంచాయతీ లో అభివృద్ధి పనులలో భాగంగా, శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ సహకారం తో 7వ వార్డు, ఎస్సీ కాలనీలో పేట గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కాండ్రేగుల గాంధీ ఆధ్వర్యంలో సుమారు 2.90 లక్షలు రూపాయలుతో సి.సి రోడ్డు నిర్మించడం జరిగింది, గత కొన్ని సంవత్సరాలగా ఎస్సీ కాలనీ వాసులు రోడ్డు లేక పడుతున్న ఇబ్బందులు తొలగిపోవడం జరిగింది, ఈ రోడ్డు నిర్మాణంతో కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భీశెట్టి గంగ అప్పలనాయుడు, కూటమి నాయకులు, ఆడారి జనార్ధన రావు ,శరగడం నాగేశ్వరావు, భీశెట్టి నాగేశ్వరరావు, ఆడారి కాశీరావు, వార్డు సభ్యులు కాండ్రేగుల నానీ, మరియు ఎల్లపు నాయుడు, శరగడం గంగరాజు, మరియు కూటమి కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.