జనం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా, మార్చ్ 18, (రిపోర్టర్ ప్రభాకర్): పార్వతీపురం పట్టణం లోని కర్షక మహర్షి ఆసుపత్తి కు అనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని (సర్వే నెంబర్ 410 వరహాలు గెడ్డ )
రక్షిoచాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ కోరారు.
ఈ మేరకు సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ లో పిర్యాదు చేసారు.స్పoధించిన సబ్ కలెక్టర్ పార్వతీపురం తహసీల్దార్ కు పిలిచి సంబంధిత వీ ఆర్ ఓ కు నోటీసు ఇచ్చి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్బంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లా కేంద్రం లో ప్రభుత్వ భూములను కాపాడి
ప్రభుత్వ ఆఫిస్ లు కట్టాలని డిమాండ్ చేసారు.